జాంబియాలో కలరా వ్యాప్తి: ఆస్పత్రిగా మారిన స్టేడియం.. 400మంది మృతి
జాంబియాలో కలరా వ్యాప్తించింది దీంతో 400 మందికి పైగా మృతి చెందారు. ఈ వ్యాధి పదివేల మందికి పైగా సోకింది. ఫలితగా జాంబియాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. ఇంకా రాజధాని నగరంలోని పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను చికిత్సా సదుపాయం కోసం వాడుతున్నారు. జాంబియన్ ప్రభుత్వం తన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను సమీకరించింది. సామూహిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన డయేరియా ఇన్ఫెక్షన్, ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తుంది. జాంబియాలో వ్యాప్తి అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాధితో 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి.