సంబంధిత వార్తలు
- సీఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష
- రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
- ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ... రూ.122 కోట్లు రాక
అల్‌ఖైదా చీఫ్ హతం
అంతర్జాతీయ తీవ్ర వాద సంస్థ అల్ ఖైదాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ అబ్దుల్ మాలిక్ ఫ్రెంచ్ సైనిక దళాలు జరిపిన దాడిలో హతమయ్యాడు.
కరుడుగట్టిన ఉగ్రవాది, ఉత్తర ఆఫ్రికా అల్‌ఖైదా చీఫ్ అయిన అబ్దుల్ మాలిక్ కోసం ప్రెంచ్ సైన్యం ఏడేళ్లుగా గాలిస్తోంది. ఉత్తర మాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న అబ్దుల్‌మాలిక్ ఉత్తర అల్జీరియాలో దాక్కున్నట్లు ఫ్రెంచ్ సైన్యం సమాచారం అందుకుంది.
దీంతో ఉత్తరమాలి, అల్జీరియా తదితర ప్రాంతాల్లో ఫ్రెంచ్ సైనికులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఉత్తర మాలిలో జరిగిన ఈ దాడిలో అబ్దుల్ మాలిక్ మరణించినట్లు ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ట్విటర్‌లో తెలిపారు.
తర్వాతి కథనం
