శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (08:30 IST)

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ... రూ.122 కోట్లు రాక

ముఖ్యమంత్రి సహాయ నిధి (కోవిడ్-19) కి ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు రూ. 122 కోట్ల 53 లక్షల 46 వేల 985 లు జమ అయినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మెంబర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల పైబడి ఏడుగురు దాతలు సాయం అందించారన్నారు. వారిలో రామోజీ ఫౌండేషన్, భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్, దివీస్ లేబోరెటరీస్ లిమిటెడ్, ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లు ఉన్నాయన్నారన్నారు.

104 మంది దాతలు లక్ష రూపాయలకు పైగా విరాళాలు అందించారని ఆయన తెలిపారు. కరోనా ఆర్థిక సాయంలో భాగస్వాములు కావాలసిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంధ్రప్రదేశ్ పేరున తమ చెక్కులను పంపాలని తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునేవారు SBI ACCOUNT NO - 38588079208, IFSC CODE - SBIN0018884, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి మరియు ANDHRA BANK ACCOUNT NO : 110310100029039, IFSC CODE – ANDB003079, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి ఖాతాలలో జమచేయాలన్నారు.

వెబ్ సైట్ ద్వారా విరాళాలు అందించాలనుకునే వారు apcmrf.ap.gov.in కు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాలని ఆయన కోరారు. విరాళాలు చెక్కుల రూపంలో మరియు ఆన్ లైన్ లో అందించే దాతలు తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈ –మెయిల్ అడ్రస్ తో పాటు ఎందు నిమిత్తం విరాళం అందిస్తున్నారో తెలియజేస్తూ, చెక్కులు ఇతర ఆన్ లైన్ వివరాలను, ప్రత్యేక అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి,ఈ-మెయిల్: [email protected] కి అందజేయగలరని ఆయన  తెలియజేశారు. 
 
వెబ్ సైట్ ద్వారా విరాళాలు ఇచ్చిన దాతలు గౌరవ ముఖ్యమంత్రి లేఖ, రసీదు,100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు పత్రాన్ని అదే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమీషనర్ తెలిపారు.