శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (22:35 IST)

లాక్ డౌన్‌: రండి రండి మీకు బ్రాందీ పోస్తానంటూ రోడ్డు పైకి వచ్చి బ్రాందీ పోశాడు

అసలే లాక్ డౌన్. మద్యం కూడా దొరక్క మందుబాబులు తెగ బాధపడిపోతున్నారు. ఎప్పుడు లాక్ డౌన్ పూర్తి అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయితే బ్లాక్‌లో అయినా ఫర్వాలేదని అప్పుడప్పుడు వైన్ షాపుల దగ్గరకు వచ్చి చూస్తున్నారు. అయితే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది కదా వైన్ షాపులను మాత్రం తెరవడం లేదు. దీంతో మద్యం ప్రియుడు వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
 
అయితే మరికొంతమంది మాత్రం గ్రామాల్లోకి వెళ్లి కల్లును తాగి సేదతీరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి ఏకంగా బ్రాందీ బాటిల్‌ను చేతిలో పట్టుకుని సిటీలో దిగి మందు పోయడం ప్రారంభించాడు. రోడ్డుపై కూర్చుని ఉన్న నిరాశ్రయులకు వారిని ప్లేట్లను పట్టమని చెప్పి బ్రాందీ పోశాడు.
 
అంతేకాదు బ్రాందీ బాటిల్ చేతిలో చూసిన కొంతమంది ప్లేట్లతో రెడీగా ఉన్నారు. దీంతో ఆ వ్యక్తి అందరికీ 30ఎం.ఎల్ పోస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. తన స్నేహితుడితో తాను మందు పోస్తున్న వీడియో తీసి ట్విట్టర్లో పెట్టాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. మీరు దయగల వ్యక్తి బాబూ అంటూ చాలామంది అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నువ్వు మా ప్రాంతంలో ఉంటే బాగుండేదని ఒక్కో ప్రాంతంలోని వ్యక్తులు సందేశాలను పంపుతున్నారు.