శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:56 IST)

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఆడశిశువు.. సరోగసీ ద్వారా..?

Shilpa shetty
బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు ఆడశిశువు పుట్టిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇన్నాళ్ల తర్వాత మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని తెలిపింది. ఇప్పటికే శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా జంటకు వియాన్‌ అనే కొడుకు ఉన్నాడు. 
 
ఇక ప్రస్తుతం జన్మించిన శిల్పాశెట్టి ఆడశిశువుకు సమీశా శెట్టి కుంద్రా అనే పేరు పెట్టారు. సమీశాలో స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ ఇచ్చింది శిల్పాశెట్టి. కాగా.. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి త్వరలో షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నికమ్మ’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.