శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (13:03 IST)

కేజీఎఫ్ హీరో యాష్ రెండోసారి తండ్రి అయ్యాడోచ్.. (video)

కేజీఎఫ్ హీరో యాష్ రెండోసారి తండ్రి అయ్యాడు. కన్నడ హీరో యాష్, ఆయన భార్య రాధికా పండిట్ దంపతులకు ఇప్పటికే ఐరా అనే 11 నెలల అమ్మాయి వుంది. ప్రస్తుతం రాధికా పండిట్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో యాష్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇకపోతే.. పలుచిత్రాల్లో కలిసి నటించిన యాష్- రాధిక 2016లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మధ్య తరగతి కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చిన యాష్ గతేడాది విడుదలైన కేజీఎఫ్‌ సినిమాతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కేజీఎఫ్‌-2 తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ ఖల్‌నాయక్‌ సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించనున్నారు. 
 
దేశంలోని ఐదు భాషల్లో కేజీఎఫ్ సీక్వెల్ సినిమా రిలీజ్ కాబోతున్నది. కేజీఎఫ్ ఛాప్టర్ 2పై యాష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సినిమా బాగుంటే.. బాక్సాఫీస్ అంకెలు నిండుతాయని యాష్ అంటున్నాడు.