శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (13:36 IST)

మరో బిడ్డకు జన్మనిచ్చిన హీరో రామ్ చరణ్ వదిన

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన నటి స్నేహ. ఈమె తమిళ నటుడు ప్రసన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ వేషాలకు దూరంగా ఉంటూ, చిన్నచిన్నపాత్రలు వేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాకా మరో బిడ్డకు జన్మినిచ్చింది. 
 
ఇటీవల స్నేహ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రంలో ఆమె హీరో రామ్ చరణ్‌కు వదిన పాత్రలో మెప్పించింది. రీసెంట్‌గా వ‌చ్చిన త‌మిళ చిత్రం 'ప‌టాస్‌'లో మెరిసింది. ప్రస్తుతం స్నేహ‌, ప్ర‌స‌న్న దంప‌తుల‌కి విహాన్ అనే కుమారుడు ఉండ‌గా, ఇపుడు ఆడ‌పిల్ల జ‌న్మించింది. 
 
ఈ విష‌యాన్ని స్నేహ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. శుక్ర‌వారం(జ‌న‌వ‌రి 24) రోజు ఆడ‌పిల్ల పుట్టడంతో త‌మ ఇంట్లోకి మ‌హాల‌క్ష్మీ వ‌చ్చింద‌ని స్నేహ దంప‌తులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.