మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పొడుగుకాళ్ళ సుందరి
బాలీవుడ్ అందాల హీరోయిన్లలో ఒకరు శిల్పాశెట్టి. అచ్చం చెక్కిన శిల్పాన్ని తలపించే అందం. ఈమె సుధీర్ఘకాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె కేవలం బాలీవుడ్‌లోనేకాకుండా దక్షిణాది భాషల్లోనూ తన నటనతో మంచి అభిమానగణాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
కానీ, ఒకవైపు తన వైవాహిక జీవితంలో బీజీగా గడుపుతూనే, మరోవైపు యోగా వీడియోలు, ఫిట్నెస్ వీడియోలు, ఐపీఎల్ క్రికెట్‌తో నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో గత 2007లో "ఆప్నే" అనే చిత్రంలో శిల్పాశెట్టి నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. చిన్నచిన్నపాత్రలకే పరిమితమైంది.
ఈ పరిస్థితుల్లో దశాబ్దకాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ మంగళూరు భామ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా చెప్పింది. త్వరలోనే షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న "నికమ్మా" అనే చిత్రంలో నటించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడు పోస్టు పెట్టింది.