బాలీవుడ్లో.. కామ్రేడ్. ఈ రీమేక్‌లో నటించే హీరో ఎవరు..?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న కథా చిత్రం సాంగ్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. గీత గోవిందం సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ - రష్మిక ఈ మూవీలో కూడా నటించడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 26న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే.. ఈ సినిమాని త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.
డియర్ కామ్రేడ్ సినిమాని నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు భరత్ కమ్మ, హీరో విజయ్‌తో కలిసి ఆయన చూశారు. సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని, కదిలించిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హిందీ రీమేక్‌లో విజయ్ దేవరకొండ నటించనున్నాడు అని.. ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం గురించి విజయ్‌ని అడిగితే... డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో నటించడం లేదని చెప్పారు. మరి.. డియర్ కామ్రేడ్ రీమేక్‌లో ఎవరు నటిస్తారో చూడాలి.