విజయ్ దేవరకొండ- విజయ్ సేతుపతి- దుల్కర్ సల్మాన్ పాడిన పాట.. ఏంటి? (Video)

dear camrede
Last Updated: గురువారం, 18 జులై 2019 (18:12 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా ద్వారా క్రేజ్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి కామ్రేడ్ యాంతమ్ పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగులో విజయ్ దేవర కొండ పాడారు. 
 
వీరి వాయిస్‌తో కూడిన పాట ప్రస్తుతం యూట్యూబ్‌నే కాదు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకుడు భరత్ కమ్మ డైరక్షన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది. 
 
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కామ్రేడ్ యాంథమ్ సాంగ్‌ను మలయాళంలో దుల్కర్, తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో విజయ్ సేతుపడి పాడారు. ఇవి డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. అలాగే గీత గోవిందం తర్వాత రష్మిక, విజయ్ జంటగా రెండోసారి నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
దీనిపై మరింత చదవండి :