శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (15:58 IST)

డియర్ కామ్రేడ్ జూలై 26న సిద్ధం.. ట్రైలర్‌లో కథంతా చెప్పేశాడు.. లిప్ కిస్‌లు..? (Trailer)

కొత్త ద‌ర్శ‌కుడు భరత్ కమ్మ తెర‌కెక్కిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఫేమ్ కుర్ర హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. గీత గోవిందం త‌ర్వాత మ‌రోసారి క‌లిసి వీరిద్దరూ న‌టిస్తున్న సినిమా ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం.. టీజ‌ర్ అదిరిపోవ‌డంతో సినిమా కూడా దుమ్ము దులిపేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 
 
అంతేగాకుడా డియ‌ర్ కామ్రేడ్ జులై 26న విడుద‌ల కానుంది. దీనిపై భారీ అంచ‌నాలున్నాయి. దాంతో ఇప్పుడు ఈ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి అప్పుడే పావులు క‌దుపుతున్నారు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు. ఒక్క‌రోజు రెండ్రోజులు కాకుండా ఏకంగా నెల రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని ఓ లొకేషన్‌లో ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిపోయింద‌ని తెలుస్తుంది.
 
ఇటీవలే డియర్ కామ్రేడ్ నుంచి అర్జున్ రెడ్డి మాదిరే మూడు నిమిషాల ట్రైల‌ర్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌. అందులోనే క‌థ అంతా చెప్పాడు. ముందు కామ్రేడ్ పోరాటం, కాలేజీ ఎపిసోడ్స్, ప్రేమ,‌ విడిపోవ‌డం, మ‌ధ్య‌లో గొడ‌వ‌లు, చివ‌ర్లో మ‌ళ్లీ మారిన మ‌నిషిగా ప్ర‌యాణం వంటి అంశాలు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. తప్పకుండా ఈ సినిమా కూడా హిట్ కావడం ఖాయమని సినీ జనం అంటున్నారు.