శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (18:16 IST)

గిర గిర గిర తిరగాలిలాగా ... అంటున్న డియ‌ర్ కామ్రేడ్..!

విజయ్ దేవరకొండ న‌టిస్తున్న తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు బాగా పెరిగాయి. 
 
తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. "గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే" అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ద‌ర్శ‌క‌త్వంలో.. రెహ్మాన్ సాహిత్యం అందించ‌గా..  గౌతమ్ భరద్వాజ్ - యామినీ ఘంటసాల పాడారు. మనసుకు హ‌త్తుకునేలా చాలా చ‌క్క‌గా ఉంది ఈ పాట‌. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్‌లో ఇదొకటని చెప్పొచ్చు. జులై 26న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.