సౌత్ మార్కెట్ పైన విజయ్ దేవరకొండ కన్ను.. ఆ దర్సకుడిని ఫాలో అవుతూ...

జె| Last Modified బుధవారం, 12 జూన్ 2019 (11:27 IST)
విజయ్ దేవరకొండ చాలా స్ట్రాటజిక్‌గా వెళుతున్నారు. సౌత్ మార్కెట్లో స్టార్‌డమ్ సంపాదించుకోవడానికి రాజమౌళి రూట్‌నే ఎంచుకుంటున్నారు రౌడీ స్టార్. లోకల్ ఫార్ములాతో ప్రణాళికలు రచిస్తున్నాడు. విజయ్ దేవరకొండ టాలీవుడ్‌ను దాటేసి సౌత్ స్టార్ అనిపించుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. నోటా సినిమాతో కోలీవుడ్‌కు వెళ్ళిన విజయ్ అక్కడ సరైన రెస్పాన్స్ రాకపోయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈసారి కోలీవుడ్‌తో పాటు సౌత్ మొత్తాన్ని ఇంప్రెజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

అందుకే హీరోను నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాడట. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఆనంద్ అన్నామలై దర్సకత్వంలో రాబోతోంది హీరో. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ లీడ్ రోల్స్‌లో రాబోతున్న ఈ సినిమాలో లోకల్ ఫార్ములాను ప్రయోగిస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌కు మలయాళ, కన్నడ, తమిళ యాక్టర్స్‌ను సెలక్ట్ చేస్తున్నారు.

కన్నడ యాక్టర్ దిగంత్‌ను ఓ కీ రోల్‌లో తీసుకుంటున్నారు. నార్త్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. కు బాలీవుడ్ స్టార్స్ ను సెలక్ట్ చేశాడు. ఇక హిందీ సాహోలో హిందీ, తమిళ, మళయాళీ యాక్టర్స్ నటిస్తున్నారు. విజయ్ తన హీరో సినిమాకు ఇదే ఫార్ములాను ప్రదర్సిస్తున్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో బిజీగా ఉన్నాడు. జూలై 26వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే హీరో సినిమాపై ఫోకస్ పెడతారట విజయ్.దీనిపై మరింత చదవండి :