శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (15:18 IST)

అర్జున్ రెడ్డి Vs ఫలక్‌నుమా దాస్... బాగా ట్రెండ్ అవుతున్న లైన్ ఇదే..

అవును అర్జున్ రెడ్డి ఫలక్‌నుమా దాస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వివాగం సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ రెండు సినిమా హీరోలు కొట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
అర్జున్ రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను విశ్వ‌క్ సేన్ టార్గెట్ చేస్తున్నాడ‌నే వార్తలు మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫ‌ల‌క్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేసాడు విశ్వ‌క్. ఇప్ప‌టికే ఒక్క‌న్ని నెత్తిన పెట్టుకున్నాం.. మ‌ళ్లీ ఇంకొక‌న్ని మోయాల్నా ఇప్పుడు అంటూ విశ్వ‌క్ చేసిన కామెంట్స్ వివాదానికి తావిచ్చాయి. 
 
ఇక సినిమా విడుద‌ల త‌ర్వాత ర‌చ్చ మ‌రింత ఎక్కువైంది. కావాల‌నే త‌న సినిమాను కొంద‌రు టార్గెట్ చేసి మ‌రీ తొక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఇండ‌స్ట్రీలో ఒక‌రు ఎదుగుతుంటే లాగే వాళ్లు చాలా మంది ఉంటారంటూ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసాడు విశ్వ‌క్ సేన్. 
 
అంతేకాదు.. తాను ఏ రివ్యూ రైట‌ర్‌ను కానీ.. ఏ మీడియా వాళ్లను కానీ.. ఏ హీరోను కానీ విమ‌ర్శించ‌లేదని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. ఎవ్వరినీ తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని స్పష్టం చేశాడు. విజయ్ దేవరకొండపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. మీడియా ఏవి పడితే అవి రాసేస్తున్నాయని మండిపడ్డారు. మ‌రి ఈ ర‌చ్చ‌కు ఎక్క‌డ ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.