గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (21:25 IST)

ఫ్లాప్ డైరెక్టర్ల మీద ఆధారపడుతున్న విజయ్ దేవరకొండ... ఎందుకలా?

తెలుగులో యంగ్ హీరో అన్న పేరేగానీ కావాల్సినంత క్రేజ్ ఉన్న హీరో విజయ దేవరకొండ. గీత గోవిందంతో 80 కోట్ల క్లబ్‌లో చేరాడు విజయ్. ఇంతవరకు ఏ యంగ్ హీరోకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇంత క్రేజ్ ఉన్నా స్టార్ డైరెక్టర్స్ విజయ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు. లేదంటే విజయ్ వాళ్ళకే దూరంగా ఉంటున్నారా. ఇప్పుడిదే తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది.
 
తెలుగులో యంగ్ హీరోలు ఓ పదిమంది దాకా ఉంటారు. విజయ్, నాని వంటి ఇద్దరు, ముగ్గురు హీరోలకే క్రేజ్ ఉంది. వీరిలో విజయ్ దేవరకొండ సమ్‌థింగ్ స్పెషల్. ముఖ్యంగా వాయిస్‌తో ఆకట్టుకుంటాడు. యూత్‌లో ఏ యంగ్ హీరోకు లేనంత క్రేజ్ విజయ్‌కు ఉంది. ఎన్ని ఉన్నా ఏం లాభం. స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడడం లేదు. స్టార్ డైరెక్టర్ల చేతిలో పడితే ఆ యంగ్ హీరోకు వచ్చే క్రేజే వేరు.
 
ప్రేమకథలు చేసుకుంటూ కెరీర్‌ను సాగిస్తున్న రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోకిరితో మహేష్‌ను స్టార్‌ను చేసిన పూరీ తనకు హిట్‌తో పాటు క్రేజ్ తీసుకొస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు రామ్. విజయ్ దేవరకొండ ఏరికోరి న్యూ డైరెక్టర్లను ప్రోత్సహిస్తున్నాడు.
 
లేదంటే ఫ్లాప్‌లలో ఉన్న డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తున్నాడే కానీ స్టార్ డైరెక్టర్ వైపు కన్నెత్తి చూడడం లేదు. కెరీర్లో ఒకే ఒక హిట్ క్రిష్ణగాడి ప్రేమ గాథ తప్ప మరో హిట్ లేని ఆ మధ్య పడిపడి లేచే వయస్సుతో ఫ్లాప్ చూసిన రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్ దేవరకొండ. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం తప్ప స్టార్ డైరెక్టర్లకు ఎందుకు విజయ్ ఇంట్రెస్ట్ చూపించలేదన్న ప్రచారం జరుగుతోంది.