శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (12:23 IST)

విజయ్ దేవరకొండ తమ్ముడు.. ''దొరసాని'' అంటూ వచ్చేస్తున్నాడు..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు హీరోగా పరిచయం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా దొరసాని అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 30వ తేదీన ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. 
 
కథాకథనాల సంగతి అటుంచితే 'దొరసాని' అనే టైటిల్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇందుకు తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టరే నిదర్శనం. ఈ టైటిలే జనాలను థియేటర్లకు రప్పిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మధుర శ్రీధర్ రెడ్డి - యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారానే, నాయకా నాయికలు పరిచయమవుతున్నారు.