గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 20 జులై 2019 (20:44 IST)

నువ్వు హీరోనా.. నువ్వు అలా చేయగలవా అన్నారు.. విజయ్ దేవరకొండ

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యువ నటుడు విజయ్ దేవరకొండ. రష్మికా మందనతో కలసి నటించిన గీత గోవిందం బ్లాక్‌బస్టర్ హిట్. విజయ్‌ను ఒక రేంజ్ లోకి తీసుకెళ్ళింది. రష్మికకు మంచి మార్కులు పడేలా చేసింది. వీరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అంటూ తెలుగు ప్రేక్షకులు చెప్పుకున్నారు.
 
అందుకే వీరి కాంబినేషన్ లోనే దర్సకుడు భరత్ ఒక సినిమాను ప్లాన్ చేసి పూర్తి చేశాడు. అదే డియర్ కామ్రేడ్. సినిమా ట్రైలర్‌లోనే ఇద్దరి మధ్య ముద్దు సీన్ హైలెట్‌గా మారింది. ఈ ట్రైలర్ కాస్తా లక్షల్లో యువత చూసేసింది. ఒక ముద్దుతోనే ఇలా విజయ్ రెచ్చిపోయాడంటే సినిమా ఇంకెలాగ ఉంటుందా అన్న ఆశక్తిలో ఉన్నారు ప్రేక్షకులు.
 
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డియర్ కామ్రేడ్ సంగీత విజయోత్సవ కార్యక్రమంలో విజయ్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. నువ్వు హీరోగా నిలబడగలవా.. అసలు నువ్వు నటించగలవా.... సినిమా చేయడమంటే చాలా కష్టమంటూ నన్ను ఎగతాళి చేసిన స్నేహితులు ఉన్నారు. 
 
అయినా నేను దేనికి బాధపడలేదు. సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు విజయ్ గ్రేట్ రా అంటూ నా ఫ్రెండ్స్ నన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎవరైనా సరే ఏదైనా సాధించాలంటే ముందుగా ఇబ్బందులు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలంటున్నారు విజయ్ దేవరకొండ.