ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (09:03 IST)

త్వరలో ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో సమావేశం జరిగింది. 
 
రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్‌కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై చర్చించారు. 
 
ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించటంపై తొలుత చర్చ జరిగింది. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు. 
 
మొత్తమ్మీద మూడోవారంలో వారం రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ 19న ఉన్నందున ఆ రోజుతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.