సంబంధిత వార్తలు
- ఇళ్లలో దూరి యువకుడు చేస్తున్న పనిచూస్తే..?
- ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం క్యూలో పడిగాపులు.. నో అడ్మిషన్ బోర్డ్.. ఎక్కడ?
- ఐదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- ఆంబులెన్స్‌లోని ఇవ్వని సర్కారు ఆస్పత్రి వైద్యులు .. కొడుకు శవాన్ని భుజంపై వేసుకుని...
- పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వీకి టాలీవుడ్లో చుక్కలు... శాపం పెడుతున్న పోసాని
రెండేళ్ల చిన్నారి.. మొసళ్ల గుంపుకు చిక్కింది.. పుర్రె మాత్రమే మిగిలింది..
కాంబోడియాలో మొసళ్ల గుంపుకు మధ్యలో రెండేళ్ల చిన్నారి చిక్కుకుంది. చివరికి మొసళ్ల నోటికి చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది. ఈ ఘటన స్థానికంగా ప్రజలను భయభ్రాంతులను చేసింది. వివరాల్లోకి వెళితే.. కాంబోడియాలో సియమ్ రియాయ్ అనే ప్రాంతంలో మొసళ్ల ఫామ్ వుంది. ఈ మొసళ్ల ఫామ్‌ను 35 ఏళ్ల మిన్ మిన్ నిర్వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం మొసళ్లను మాత్రమే వదిలిపెట్టి.. ఫామ్‌కు సంబంధించిన పనుల కోసం బయటికి వెళ్లాడు. మిన్ మిన్ తొలి సంతానం రెండేళ్ల చిన్నారి రోమ్ రాథ్ బయట ఆడుకుంటూ వున్నది. ఆతని భార్య అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆ పాపాయిని చూస్తూ.. ఆడుకుంటూ వున్న తొలి బిడ్డను పెద్దగా పట్టించుకోలేదు.
కానీ రోమ్ రాథ్ కాలు జారి మొసళ్ల ఫామ్‌లో పడటంతో మొసళ్లు ఆ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. చివరికి రోమ్ రాథ్‌ను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రికి.. మొసళ్ల బృందంలో రోమ్ రాథ్ పుర్రె మాత్రం కనిపించింది. దీంతో షాక్ తిన్న మిన్ మిన్ బోరున విలపించాడు. ఇంట్లోనే ఆడుకుంటూ వుంది కదానుకున్న రోమ్ రాథ్ తల్లి మొసళ్లు తన బిడ్డను పొట్టను బెట్టుకున్న విషయం తెలుసుకుని రోదించింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
