పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వీకి టాలీవుడ్‌లో చుక్కలు... శాపం పెడుతున్న పోసాని
నటుడు పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే. ఇది అందరికీ తెలిసిందే. నోరు తెరిస్తే ఇక ఆపకుండా మాట్లాడి ఎదుటివారిని ముప్పుతిప్పలు పెడుతూ మాట్లాడుతుంటారు పోసాని. అయితే గత కొద్దిరోజుల ముందు ఆపరేషన్ చేసుకుని రెస్ట్ తీసుకున్న పోసాని మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నారు.
కానీ పోసాని క్రిష్ణమురళికి అవకాశాలు రావడం లేదట. కారణం తెలుగుదేశం పార్టీని పోసాని క్రిష్ణమురళి విమర్శించడమేనట. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోసాని ఉండటం జరిగింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారే ఎక్కువమంది ఉన్నారు.
నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా అయితే భారీ బడ్జెట్ మూవీ. కానీ కొంతమంది ఆ అవకాశం రాకుండా అడ్డుపడ్డారు. నన్ను ఆ సినిమాలో తీసుకోకుండా చేసేశారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్. పార్టీ అనేది మనస్సులో ఉంటుంది. ఇప్పుడు వైసిపి అధికారంలో ఉంది. అయినా నాకు అవకాశాలు రావడం లేదు. నాకు అవకాశాలు రాకుండా చేసిన వారెవరో నాకు తెలుసు. కానీ నేను చెప్పను. అంతా దేవుడు చూసుకుంటాడంటున్నారు పోసాని క్రిష్ణమురళి. థర్టీ ఇయర్స్ పృథ్యీ పరిస్థితి కూడా ఇలాగే వున్నట్లు చెప్పుకుంటున్నారు.