1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Fact Check: Did Israelis Sing Hanuman Chalisa in Hebrew

హనుమాన్ చాలీసాను పఠిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు.. కెప్టెన్ మచ్చర్ కోసం.. వీడియో వైరల్

Hanuman chalisa
Hanuman chalisa
టెల్ అవీవ్‌లోని ఒక బీచ్‌లో ఇజ్రాయెల్ ప్రజలు హనుమాన్ చాలీసాను పఠిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు నివాళిగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వీడియోలో హనుమంతుని చిత్రం, కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఫోటో, కృతజ్ఞతా సందేశం కనిపిస్తుండగా, తెల్లని దుస్తులు ధరించిన మహిళల బృందం ఎంతో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలామంది ఇది డాక్యుమెంట్ చేయబడిందని చెబుతున్నప్పటికీ, ఆ వాదనను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు. ఇంకా ఆ వీడియోను ఏఐ (AI) రూపొందించిందని కొందరు అనుమానిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హైజాకింగ్ యత్నాన్ని కెప్టెన్ మచ్చర్ భగ్నం చేసి, పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన అనంతరం మచ్చర్ ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో  మాట్లాడుతూ.. "నాకు బాధ కలిగినప్పుడల్లా, నేను హనుమాన్ చాలీసా జపిస్తాను. ఆ సమయంలో కూడా నేను హనుమాన్ చాలీసా మాత్రమే జపిస్తున్నాను. దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు. నేను మీతో ఎప్పుడైనా మాట్లాడగలనని ఒక్క క్షణం కూడా అనుకోలేదు. ఇప్పుడు ఇది జరిగింది." అంటూ పేర్కొన్నారు. 
 
యూఏఈకి చెందిన ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థలో డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా మచ్చర్ పనిచేస్తున్నారు. ఆయనకు 13 సంవత్సరాలకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం, సుమారు 9,750 గంటల మొత్తం విమానయాన అనుభవం ఉంది. ప్రధానంగా బోయింగ్ 737 విమానాలను నడిపారు. 
 
ఫ్లైదుబాయ్‌లో చేరకముందు, ఆయన భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో 11 సంవత్సరాలు పనిచేశారు, అక్కడ ఆయన లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా సేవలందించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Telugu States weather forecast: అక్టోబర్ 27, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?