1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Ivanka Trump Assassination Plot Iran-Trained Operative Arrested For Targeting POTUS-Daughter

డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర?

ivanka trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. ఐఆర్‌జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు ఈ కథనాలు పేర్కొంటున్నాయి. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ పథక రచన చేశాడని పేర్కొంది. కానీ, అతడు ప్లాన్‌ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలియజేసింది. 
 
32 ఏళ్ల మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ కొంతకాలం క్రితం టర్కీలో అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకు తరలించారు. అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంక కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్‌ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.
 
ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్‌ (ఐఆర్‌జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్‌కు కమాండర్‌గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్‌వర్క్‌లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విమాన ప్రయాణాలకు పవన్ సొంత డబ్బునే వాడతారు.. జగన్‌కు షాకిచ్చిన నాదెండ్ల