సంబంధిత వార్తలు
- తుఫాను వచ్చే ముందు అంతా ప్రశాతంగానే ఉంటుంది : డోనాల్డ్ ట్రంప్
- Donald Trump: చైనాలో పర్యటించనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ఇంధన కొరత - ధరల పెరుగుదల... విమాన సర్వీసులు నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్
- నేను రేపిస్టును కాదు... నేను ఎవరినీ రేప్ చేయలేదు : డోనాల్డ్ ట్రంప్
- డిన్నర్ మీట్ కాల్పుల నిందితుడు మెకానికల్ ఇంజనీర్...
ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం
ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమని నెతన్యాహుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించాల్సిందేనంటూ నెతన్యాహు పట్టుబట్టగా, ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదని ట్రంప్ తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇదే అంశంపై వారిద్దరి మధ్య రెండు గంటల పాటు ఫోనులో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఇరాన్‌పై వెంటనే వైమానిక దాడులు ప్రారంభించాలని నెతన్యాహు ఒత్తిడి చేయగా, దౌత్య చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు.. ఈ ఫోన్ కాల్ తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌తో శాంతి చర్చలపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాడులను ఆలస్యం చేయడం పెద్ద పొరపాటని, ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ప్లాన్ ప్రకారం యుద్ధాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన ట్రంప్‌తో వాదించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, యుద్ధానికి స్వస్తి పలికేలా అమెరికా-ఇరాన్ మధ్య సంతకాలకు ఖతార్, పాకిస్థాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ట్రంప్ వివరించినట్లు తెలుస్తోంది. అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి తెరిచే అంశాలపై 30 రోజుల పాటు చర్చలు జరపాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ అవి విఫలమైతే మళ్లీ యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
