1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Meta pulled the plug before employees could even make it home, right after telling them to work from home

రేపటి నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి ఇంటికెళ్లే లోపే పీకేసిన మెటా

Lay-offs
రేపటి నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పిన మెటా సంస్థ పలువురు ఉద్యోగులకు ఇ-మెయిల్స్ పంపి వారు ఆ ప్రయత్నాల్లో వుందామనుకున్న తరుణంలో తెల్లారేసరికి పింక్ కార్డ్ మెయిల్ పంపిందట. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటూ మెయిల్ చేసినట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, ఈ ఉద్యోగులను తొలగించినట్లు తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బుధవారం నుంచే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
 
కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని మేనేజర్ స్థాయి పోస్టులను తొలగించి, చిన్న బృందాలతో "ఏఐ-నేటివ్" నిర్మాణాలను ఏర్పాటు చేయాలని మెటా భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా మూసివేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ తొలగింపులు, బదిలీలతో కలిపి సుమారు 20 శాతం మంది సిబ్బందిపై, అంటే దాదాపు 16,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడొచ్చని అంచనా.
 
మెటా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల కంపెనీ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతుండగా, మరికొందరు కంపెనీ అంతర్గత ప్లాట్ఫామ్ 'వర్క్స్'లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్న కొత్త మౌస్-ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌పై గోప్యతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ 1,000 మందికి పైగా ఉద్యోగులు పిటిషన్లపై సంతకాలు చేశారు. 
About Writer
ఐవీఆర్