సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం - లీటరు పెట్రోల్ ధర రూ.409
- Fatima Sana: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ మహిళా క్రికెటర్ ఫాతిమా సనా
- ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం
- పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఆపరేషన్ సిందూర్
- Australia to tour Pakistan : మే 30 వన్డేల సిరీస్- పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన
35మంది ఉగ్రవాదులను హతమార్చిన పాకిస్తాన్ భద్రతా దళాలు
బలూచిస్తాన్‌లోని మంగ్లా జర్ఘూన్ ఘర్ ప్రాంతంలో కొనసాగుతున్న నిఘా ఆధారిత ఆపరేషన్‌లో, పాకిస్తాన్ భద్రతా దళాలు 35 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ముగ్గురు కీలకమైన సీనియర్ కమాండర్లను పట్టుకున్నాయి. మే 13న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో, గత నాలుగు రోజుల్లో 35 మంది ఉగ్రవాదులు మరణించారని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ ఆదివారం రాత్రి క్వెట్టాలో మీడియాకు తెలిపారు.
ఈ ఆపరేషన్ నిషేధిత 'తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్‌లో వారికి అనుబంధంగా పనిచేస్తున్న ఇతర గ్రూపులకు వ్యతిరేకంగా చేపట్టబడిందని రింద్ పేర్కొన్నారు. పట్టుబడిన ముగ్గురు కమాండర్లు అత్యంత కీలకమైన వ్యక్తులని, ఆ ప్రావిన్స్‌లో ఇంతకుముందు పట్టుబడిన మిలిటెంట్ల నుండి సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని రింద్ పేర్కొన్నారు.
భద్రతా దళాలు మంగ్లా జర్ఘూన్ ఘర్ ప్రాంతంలోని పలు స్థావరాలను కూడా ధ్వంసం చేశాయని రింద్ తెలిపారు. ఈ ఉగ్రవాద మూకలకు సహకరించేవారు, వీరిని నడిపించేవారు, ఆర్థిక సహాయం అందించేవారిని పట్టుకునే లక్ష్యంతో, విశ్వసనీయమైన, ఆచరణ సాధ్యమైన నిఘా సమాచారం ఆధారంగా ఆ ప్రావిన్స్‌లో అదనపు ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ తాజా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు సంబంధించి పాకిస్తాన్ సైన్యం ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
