సంబంధిత వార్తలు
- ఒక్క పులి కాదు.. ఒకేసారి నాలుగు పులుపు దాడికి ప్రయత్నిస్తే...?
- చైనాపై గుర్రుగా వున్న అమెరికా.. 1000 మంది విద్యార్థుల వీసాల రద్దు
- ఖాజీపల్లి ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్!
- 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్, అభివృద్ధికి రూ. 2 కోట్లు
- వాళ్లు సైనికులు కాదు లూజర్లు, నేను చాంపియన్‌ను: సూప్‌లో పడ్డ ట్రంప్
వేరే దేశాలకు లేని సమస్య అమెరికాకు మాత్రమే ఉంది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అడవుల్లో తరుచూ అగ్నిప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, వీటిపై స్పందించిన ట్రంప్ తరచూ రాజుకుంటున్న అడవుల సమస్య అమెరికాలో మాత్రమే ఉందని ఇది వేరే దేశాలలో లేవని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో అడవుల్లో రాజుకున్న మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశాన్ని ట్రంప్ తన ప్రచారంలో ఈ కార్చిచ్చు గురించి ప్రస్తావించనే లేదని విపక్షాలు నిలదీసిన వేళ ఆయన ఫైర్ ఫైటర్స్‌తో సమావేశమై పరస్థితిపై చర్చించారు.
ఆపై మీడియాతో మాట్లాడుతుండగా వాతావరణ మార్పుల కారణంగానే అడవులు మండుతున్నాయా, అనే ప్రశ్న ఎదురైన వేళ ట్రంప్ స్పందించారు. అన్ని దేశాలలో మంటలు అంటుకునే చెట్లున్నాయని కానీ అమెరికాలో ఉన్న సమస్య వేరేననీ, అది ఏ ఇతర దేశాలలో లేవని ట్రంప్ తెలిపారు.
తర్వాతి కథనం
