శనివారం, 25 మార్చి 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:33 IST)

మింత్రా బ్రాండ్ అంబాసిడర్‌‌గా సమంత అక్కినేని

దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటి సమంతా అక్కినేనిని మింత్రా తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించగా, ఆమె ఈ ప్రాంతంలో అత్యంత భారీ మరియు విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు ఈ ఫ్యాషన్ బ్రాండ్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. ఈ అత్యంత ప్రభావవంతమైన, ప్రఖ్యాత నటి ఇప్పుడు దక్షిణాదిలో మింత్రాకు మరో ముఖం కానున్నారు. లక్షలాది మంది ఫ్యాషన్ ప్రియులైన వినియోగదారులకు బ్రాండ్‌ను పరిచయం చేయడంలో కీలక పాత్రను పోషించనున్నారు. ఈ ప్రాంతంలో వినియోగదారులకు ఫ్యాషన్ ఎంపికలకు నేతృత్వం వహించనున్నారు.
 
ప్రస్తుతం విస్తృతమైన వినియోగదారులను కలిగి ఉన్న మింత్రాకు, వారితో పాటే సమంతాకు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను కలిగి ఉండడంతో తన వినియోగదారులను మరింత క్రియాశీలకంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషించనున్నారు. చలన చిత్రాలు, ఫ్యాషన్ మధ్య బలమైన అనుసంధానం భారతదేశంలో చక్కగా పెనవేసుకుని అభివృద్ధి చెందింది. మింత్రా దీన్ని తన శక్తియుత, రుజువు చేయదగిన అంశాలను అలవర్చుకోవడం ద్వారా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌లో అత్యంత ప్రాధాన్యతల కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తోంది.
 
నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల గ్రహీత, పరోపకారిగా అందరి మనసులకు చేరువైన సమంత దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు నటిగా సుపరిచితురాలు. ప్రాంతీయ చలన చిత్రాల్లో ఆమె పాత్రలకు చక్కని గుర్తింపు ఉంది. ఆమె స్టైల్ మరియు దోషరహిత ఫ్యాషన్ స్థానిక ప్రేక్షకులపై ఆమె చక్కని ప్రభావాన్ని చూపగా, అది మింత్రాకు ఈ ప్రాంతంలో మరింత లోతుగా విస్తరించేందుకు సహకరించనుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి సమంతా అక్కినేని మాట్లాడుతూ, ‘‘ఫ్యాషన్‌లోని అన్ని అంశాల్లో అగ్రగామిగా ఉండే ప్రముఖ బ్రాండ్ మింత్రా భాగస్వామ్యంలో కలిసి పని చేసేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఫ్యాషన్ అనేది నా జీవితంలో ఎల్లప్పుడూ అవిభాజ్య భాగం కాగా, ఈ భాగస్వామ్యం నాకు మరింత ప్రత్యేకంగా చేసింది. మింత్రా లక్షలాది మందికి వారి ఫ్యాషన్ ఎంపికలను వ్యాఖ్యానించేందుకు, ఫ్యాషన్ ప్రపంచంలో అత్యాధునిక ఎడిషన్లతో నన్ను నిరంతరం కలిసిమెలసి ఉండేందుకు సహకరించింది. ఇది నాకు అత్యంత మౌలిక అనుబంధంగా ఉంది మరియు అర్థవంతమైన భాగస్వామ్యం కోసం వేచి చూస్తున్నానని’’ పేర్కొన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి మింత్రా సీఈఓ అమర్ నగరం మాట్లాడుతూ, ‘‘సమంత దక్షిణాదిలో మా బ్రాండ్‌కు రాయబారిగా ఉండటం ఈ ప్రాంతంలోని ఫ్యాషన్ ప్రియులైన వినియోగదారులతో సదృఢమై బాంధవ్యాన్ని ఏర్పరుచుకోవడంలో ప్రముఖమైనది. సమంతా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తారు. ఆమె ద్వారా వినియోగదారులతో లోతైన క్రియాశీలతను సాధించడంలో అత్యంత ముఖ్యంగా ఉంది. ఈ భాగస్వామ్యం విస్తరిస్తున్న ఫ్యాషన్, జీవనశైలి అవసరాలను భర్తీ చేయడంలో మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక ముందడుగు’’ అని వివరించారు.
 
మింత్రా తన మొదటి బ్రాండ్ ప్రచార జాగృతిని సమంతతో కలిసి టీవీ వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రారంభించగా ఇది డి ఫ్యాక్టో స్టైల్ ఎక్స్‌పర్ట్‌గా దేశంలో అంతిమ ఫ్యాషన్ కేంద్రంగా మార్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రచార జాగృతి కేంద్రంలో వినియోగదారుల-కేంద్రిత బ్రాండ్ పొజిషనింగ్ ఉండగా, ఇది మన అన్ని జీవితాల్లో పలు ‘‘అద్భుత క్షణాలకు’’ సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించబడినది. ఫ్యాషన్ ఈ క్షణాన్ని ప్రత్యేకంగా అలానే స్మరణీయంగా చేయడంలో ప్రముఖ పాత్రను పోషించనుంది. మింత్రా జీవితంలో అద్భుత క్షణాలకు ఎలా స్టైలింగ్ అనే దాన్ని ప్రదర్శిస్తుంది.
 
50 క్షణాల టీవీ వాణిజ్య ప్రకటనలో సమంతా కనిపిస్తుండగా దక్షిణ భారతదేశంలోని మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని ప్రసారం చేస్తున్నారు. వారి ఆఫ్-స్క్రీన్ మరియు ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సమంతా ఈ చిత్రంలో ఫ్యాషన్, స్టైల్ ఐకాన్‌గా చిత్రీకరించగా, యువ నాయకులను తమ ఫ్యాషన్ ఎంపికల గురించి హితకరంగా భావించేలా, మింత్రా వారివైపు ఉన్నప్పుడు విశ్వాసంతో నిర్ణయాలను తీసుకునేలా ఉత్తేజించడం ద్వారా మింత్రాను మార్గదర్శకునిగా, గైడ్‌గా తన స్థానాన్ని మరోసారు ధ్రువీకరించుకుంటారు.