ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 ఆగస్టు 2020 (19:33 IST)

నేను మూడేళ్ల క్రితం నుంచే ప్రెగ్నెంట్, సమంత అక్కినేని

సమంత అక్కినేని. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు. స్టార్ ఇమేజ్ వున్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ తన స్టామినా ఏంటో నిరూపించుకుంటుంది. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనూ కష్టపడుతోంది. మేడపైన కూరగాయల మొక్కలు వేసి వాటిని పెంచుతూ చక్కగా భర్త నాగచైతన్యకు వంట చేసి పెడుతోంది.
 
వీకెండ్ కావడంతో తన సోషల్ నెట్వర్కింగ్ పేజీల్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానిస్తూ వస్తోంది. ఓ అభిమాని... బాలీవుడ్ అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయ్యారు, మరి మీరెప్పుడు అని ప్రశ్నించగా... తను 2017 నుంచి ప్రెగ్నెంట్‌నేననీ, కానీ బేబీ బయటకు రావడానికి సమయం తీసుకుంటుంది అని సెటైర్ వేసింది. 
 
ఇదిలావుంటే ఇటీవల సమంత సినిమాలకు అంగీకరించడం లేదని టాలీవుడ్ టాక్. మరి అమ్మడు పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుందేమోనన్న వార్తలు వినిపిస్తున్నాయి.