సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (16:31 IST)

గర్భిణిని బంధించి రెండు రోజులు అత్యాచారం, ఎక్కడ?

అసలే నిండు గర్భిణి. ఆసుపత్రి చెకింగ్‌కు వెళ్ళాలనుకుంది. బంధువులు అందుబాటులో లేకపోవడంతో పక్కింటి వ్యక్తి సాయం తీసుకుంది. కానీ ఆ వ్యక్తే చివరకు తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదు. రెండురోజుల పాటు గదిలో నిర్భంధించి అత్యాచారం చేయడమే కాకుండా అతిదారుణంగా హింసించాడు ఓ యువకుడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఒక మహిళకు కొంతకాలం క్రితమే వివాహమైంది. ఇప్పటికే ఇద్దరు సంతానం. ఆరు నెలల క్రితం గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. ప్రతి నెల ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉండేది. 
 
అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో వెళదామనుకుంది. అయితే మధ్యలో ఇంటి పక్కనే ఉన్న మల్లయ్య అనే యువకుడు కనిపించాడు. తన మోటారు సైకిల్ పైన ఆసుపత్రిలో దింపుతానని నమ్మించాడు. దీంతో నమ్మిన ఆమె స్కూటర్ ఎక్కింది. 
 
ఒక గదికి తీసుకెళ్ళి ఆ యువకుడు రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా తప్పించుకుని ఆలేరు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా పెద్దల పంచాయతీకి పంపించారు. దీనిపై మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.