గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (18:38 IST)

మాంసాన్ని భుజిస్తున్నట్లు కలగంటే..? (video)

Dreams
కొన్ని స్వప్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మరికొన్ని చెడు ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ వుంటారు. అలాంటి వాటిల్లో ఉపాధ్యాయులు పాఠాలు తీస్తున్నట్లు కలగంటే.. మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కలలో చంద్రునిని వీక్షించినట్లైతే.. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారు.. పాము కరిచినట్లు నెత్తురోడినట్లు కలకంటే శీఘ్రమే వివాహం జరుగుతుంది. 
 
చిన్నారులు కలలో కనిపిస్తే.. శుభకార్యాలు జరుగుతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. దేవతలను కలలో చూసినట్లైతే.. నిధులు లభిస్తాయి. వివాహాలను కలలో వీక్షించినట్లైతే సామాజంలో కీర్తి ప్రతిష్ఠలు చేకూరుతాయి. కలలో ఆత్మహత్య చేసుకున్నట్లు వీక్షిస్తే.. ఆపదలు తొలగి, శుభకార్యాలు చేకూరుతాయి. ఇంకా తాబేలు, చేపలు, కప్పలు వంటి జీవులను కలలో వీక్షిస్తే.. దుఃఖం తొలగిపోతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. 
 
గర్భిణీ మహిళ కలలో కనిపిస్తే.. ధనాదాయం చేకూరుతుంది. శుభ ఫలితాలుంటాయి. పితృదేవతలతో మాట్లాడినట్లు కల గంటే.. అధికారం, పదవీయోగం, లాభం వంటి శుభ సంకేతాలున్నాయి. మాంసాన్ని భుజిస్తున్నట్లు కలగంటే.. అదృష్టం వెతుక్కుంటూ వస్తోంది. నెమలి, ఆకాశం కలలో కనిపిస్తే.. దంపతుల మధ్య అన్యోన్యత చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.