శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (17:11 IST)

మట్టి పాత్రల్లో మాంసాహారం వండితే.. ఎంత మేలో తెలుసా?

Pot
మట్టి పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తుంది. మట్టి కుండల్లో వంట చేయడం వలన పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. 
 
మట్టి కుండలో వండిన ఆహారంలో నూనె శాతం తక్కువుగా ఉంటుంది. బలమైన ఆహరంగా వీటిని చెప్తారు. నేరుగా ఆహరంలో పోషకాలు ఉంటాయి, బెస్ట్ రెసిపీలతో పాటు మట్టి పాత్రల వల్ల ఎలాంటి చెడు ఉండదు. కుండల్లో పెరుగు చల్లగా చిక్కగా మంచిగా రుచిగా ఉంటుంది. రంధ్రాలున్న మట్టి కుండ లేదా పాత్రలో వండటం వల్ల ఉష్ణోగ్రత, ఆవిరి అన్నివైపులా పరుచుకోవడంతో వంటకం బాగా ఉపయోగపడుతుంది. 
 
ముఖ్యంగా మాంసాహారం మట్టికుండలో వండితే ఎంతో రుచిగాను, మెత్తగానూ వుంటుంది. అందు కే ఈ మధ్య రెస్టరెంట్లలో కుండ బిర్యానీ బాగా ప్రాచుర్యం పొందింది. మట్టికుండలో ఆహారం త్వరగా చల్లారదు. కాబట్టి  అప్పుడప్పుడు వేడి చేయాల్సిన అవసరం వుండదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.