మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (19:14 IST)

పేదవాడి ఆపిల్.. జామపండు గురించి తెలిస్తే.. రోజుకు ఒకటైనా తింటారు.. (Video)

జామపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామపండే కదా అని తేలికగా తీసిపారేసే వారు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజుకు ఒకటైనా తీసుకుంటారు. అవేంటో చూద్దాం.. జామ. పేదవాడి యాపిల్‌గా పేరుపొందింది. ఈ పండును ప్రతిరోజూ తీసుకోడం వల్ల థైరాయిడ్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
 
విటమిన్-సి లోపం కారణంగా సంభవించే వ్యాధులను జామపండు నయం చేస్తుంది. జామను తింటే థైరాయిడ్ దరి చేరదు. జామలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జామకాయ రోజూ ఒకటి తింటే చాలు చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలోనూ జామ పండు ఎంతో మేలు చేస్తుంది. 
 
అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి. ఇది ఒకటి తింటే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది. జామపండు చెడు కొవ్వును తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
జామపండులోని ఉండే మరో అద్భుతమైన గుణం ఏంటంటే... ఈ పండు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించేందుకు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. జామ పండులో ఉండే లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
 
ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సాయపడుతుంది. జామ పండు ప్రోస్టేట్ కాన్సర్, రొమ్ము కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. 
 
ఇందులోని పోషకాలు సంతాన సమస్యలను దూరం చేస్తాయి. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా వుంటుంది.  ఇది మన చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. అనేక దంత సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.