1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. 7 surprising health benefits of coriander

దగ్గు, ఆయాసం తగ్గేందుకు ధనియాలతో ఇలా చేస్తే సరి... (video)

surprising health benefits
మనం రోజూ వంటింట్లో దినుసులను కూరల్లో వాడుతుంటాం. ఐతే మనం కూరల్లో వాడే ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.
 
2. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
 
3. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.
 
4. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది.
 
5. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
 
6. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
 
7. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

 
తర్వాతి కథనం
వంకాయ ఇంకేమన్నానా అనుకునేరు, ఇది చాలా పవర్‌ఫుల్ (video)