మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:43 IST)

కిడ్నీ సమస్యకు ఈ కషాయంతో ఫట్

ఇటీవలి కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ కషాయం ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - గుప్పెడు
మంచినీళ్లు - 1 గ్లాస్
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడి ఆపై 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వలన పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
 
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే కొత్తిమీర కషాయం తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.