కేరట్ తీసుకుంటుంటే ఈ 5 ప్రయోజనాలు
1. ఎలర్జీలు, అనీమియా నుంచి కేరట్ కాపాడుతుంది. నరాల బలహీనతనుంచి కూడా రక్షిస్తుంది. దీన్ని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవటంవల్ల కంటిచూపు మెరుగవుతుంది.
2. క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఫొటో కెమికల్స్, కాల్షియమ్, పొటాషియమ్, విటమిన్ ఎ, బి1, బి2, సి, ఇలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
3. ఉడికించిన కేరట్ విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియమ్‌లను కలిగి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి, రివిటలైజ్ చేయడంలో దీనికిదే సాటి.
4. కేన్సర్ నిరోధకంగా పనిచేసే అతిగొప్ప కూరగాయ క్యారెట్. గుండెజబ్బును నివారించడంలోనూ చక్కగా పని చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది.
5. కాలిన గాయాలు మానేందుకు పూతగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. నోటిలో ఏర్పడే పుళ్లు, వేడిని తగ్గించేందుకు భోజనం తరువాత ఓ కేరట్ తీసుకుంటే మంచిది.