శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (14:25 IST)

గర్భిణులు క్యారెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి...

రక్తహీనతతో బాధపడే వారికి క్యారెట్ గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.
 
చర్మ వ్యాధి బాధితులు రోజూ క్యారెట్ తినడంతో పాటు, క్యారెట్ జ్యూస్‌లో కొన్ని చుక్కల నిమ్మ, వేప రసాలను కలిపి ఒంటికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
హైపర్ ఎసిడిటీ, అల్సర్, మలబద్ధకం, అజీర్తి, అర్శమొలలు, కాలేయం సమస్యలు ఉన్నవారు క్యారెట్‌ను తప్పనిసరిగా తింటూ ఉండాలి.
 
టేబుల్ స్ఫూన్ క్యారెట్ జ్యూస్‌లో, అర టేబుల్ స్ఫూన్ నిమ్మరసం కలిపి ఒంటి మీది మచ్చల మీద రాసుకుంటే, అవి తొలగిపోతాయి.
 
గర్భస్థ శిశువు పెరుగుదలకు క్యారెట్‌లో ఉండే విటమిన్-ఎ ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల గర్భిణులు క్యారెట్‌ను తప్పనిసరిగా తినాలి.
 
డైటింగ్ చేసేవారు రోజూ మూడు నాలుగు గ్లాసుల క్యారెట్ రసం తీసుకుంటే ఒంటిపై ఏర్పడిన ముడతలు తగ్గుతాయి. డీ-హైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.