బీట్రూట్ జ్యూస్‌తో ఎంత మేలో తెలుసా?
పండ్ల రసాలు త్రాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని మనందరికీ తెలిసిందే, శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మనం సొంతం అవుతుంది. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పండ్లే కాకుండా కూరగాయల జ్యూస్‌లు త్రాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
క్యారట్ జ్యూస్ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా కళ్ళకు ఎంతో మంచిది. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి. ఇకపోతే బీట్రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయట. అలాగే, కడిగిన టమోటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.