శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (11:09 IST)

టీ, కాఫీలొద్దు.. గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని?

చాలా మంది నిద్ర లేవగానే టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తారు. టీ, కాఫీలు నిద్రమత్తు వదిలించడానికి, నూతన ఉత్సాహాన్ని అందించడానికి దోహదపడతాయి కానీ వీటి కంటే ముందు నిద్ర లేవడంతోనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 
 
పరగడుపున తేనె, నిమ్మరసం త్రాగడం వలన గ్యాస్ట్రో సిస్టమ్ మెరుగుపడుతుంది. దీని వలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నిమ్మ శరీరంలోని టాక్సిక్‌లను నిర్మూలించే సాధనంగా పనిచేస్తుంది. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీనిలోని మంచి గుణాలు శరీరంలో పిహెచ్ విలువలను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. 
 
ముందు రోజు మసాలాలు లాంటివి తిన్నప్పుడు అవన్నీ శుభ్రం అయి కడుపు ఉబ్బరం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మ ఎంతగానో సహాయపడుతుంది. నిమ్మ బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. 
 
దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడి ఆకలి నియంత్రణకు దారి తీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తేనె నిమ్మరసం తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి జలుబు, అనేక రకములైన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.