శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సందీప్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (18:41 IST)

రోజూ వాడే పేస్టుకి తులసి పౌడర్ జతచేస్తే?

ముఖానికి చిరునవ్వే అందం. మనం నవ్వినప్పుడు పళ్లు వికారంగా కనిపిస్తే అందమే పోతుంది. చాలా మందికి పళ్లు పాచిపట్టడం లేదా గారపట్టడం జరుగుతుంది. దీంలో పళ్లు పచ్చగా లేదా ఎర్రగా మారతాయి. అలాంటి వారు పక్కవారితో మాట్లాడాలన్నా కూడా సిగ్గుగా ఫీల్ అవుతారు. దాచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. గార పోగొట్టుకోవడానికి పలుమార్లు బ్రష్ చేయడం వంటివి చేస్తారు. 
 
 కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. టూత్‌ పేస్టుల కంటే ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యను చక్కగా పరిష్కరించుకోవచ్చు. ఆ రెండు పదార్థాల్లో ఒకటి బేకింగ్ సోడా, రెండోది నిమ్మరసం. 
 
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. అంతే మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాటిని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పళ్లు రుద్దుకుంటే కూడా పచ్చని దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంది. 
 
రోజూ వాడే పేస్టుకి ఈ తులసి పౌడర్ జత చేసినా మంచిదే. ఇతర సమస్యలకు కూడా తులసి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు తోముకున్నా పసుపు రంగు మీద ప్రభావం చూపిస్తుంది. లవంగాలను పొడి చేసి పేస్టుతో కలిపి రుద్దుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీనివల్ల పళ్లు ధృఢంగా కూడా తయారవుతాయి.