శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 మే 2019 (22:26 IST)

వేధించే పంటి నొప్పి... వదిలించుకునేదెలా?

ఇటీవలకాలంలో చాలామంది పంటినొప్పి సమస్యతో బాధపడుతున్నారు. పంటిపై ఉండే గారలో బాక్టీరియా నివాసముండి, నోటిలో ఉన్నా తీపి పదార్థములను, పిండి పదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఎనామల్ పైన దెబ్బతీయును. తద్వారా ఎనామేల్ పాడవడం వలన ఇన్ఫెక్షన్... పంటి నరాలు, మూలభాగములో చేరి కణజాలము, నాడులు చెడిపోవడం వలన పంటి నొప్పి కలుగుతుంది. 
 
పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజువారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనలో చాలామందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి నివారణకు ఇంట్లో ఉన్న పదార్దాలతోనే కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు. అవేంటో చూద్దాం. 
 
1. వెల్లుల్లి, లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది. 
 
2. పచ్చి ఉల్లిపాయ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండుట వల్ల దానిని 3 నిముషాలు నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నములుట కష్టంగా ఉంటే అప్పుడే కోసిన ఉల్లిపాయ ముక్కను పెట్టుకోవచ్చు. 
 
3. అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరినూనె, టీస్పూన్ మిరియాలపొడి, చిటికెడు ఉప్పు వీటిని అన్నింటిని కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది.
 
4. వెల్లుల్లిలో యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి దానికి చిటికెడు మెత్తని ఉప్పును కలిపి పుచ్చిపంటిపై పెడితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
 
5. జామ ఆకులలో యాంటీఇన్ ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు రెండు లేక మూడు జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తినటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.