గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:58 IST)

బేకింగ్ సోడా, నిమ్మరసంతో అందమైన దంతాలు..

ముఖానికి చిరునవ్వు అందం. మనం నవ్వేటప్పుడు పళ్లు కూడా అందంగా కనిపించాలి. పాచి లేదా గార కనిపిస్తే మనకే సిగ్గు అనిపిస్తుంది. చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పళ్లపై వచ్చే నల్ల గారను పోగొట్టుకోలేరు. ఎన్నో టూత్ పేస్ట్‌లు, బ్రష్‌లు ఉపయోగించినా ప్రయోజనం ఉండదు. అంగట్లో దొరికే పదార్థాలకు బదులుగా మనం ఇంట్లోనే దానికి పరిష్కారం వెతుక్కోవచ్చు. 
 
బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించి తెల్లని పళ్లను మన సొంతం చేసుకోవచ్చు. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో సగం చెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్రష్ చేస్తున్నట్లుగా వేలితో పళ్లపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా మూడు నిమిషాలు చేసి నీటితో పుక్కిలించితే మీ పళ్లు తలతలా మెరిసిపోతాయి.
 
పిడికెడు తులసి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిచేసి దానిని పళ్లకు రుద్దుకున్నా కూడా పచ్చటిగార పోయి దంతాలు మెరుస్తాయి. రోజూ ఉపయోగించే పేస్ట్‌కి తులసి పొడిని జోడించి పళ్లకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది. ఉప్పులో నిమ్మరసం పిండి పళ్లు తోముకున్నా పచ్చదనం పోతుంది. లవంగాల పొడిని పేస్ట్‌లో కలిపి బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. పళ్లు పుచ్చిపోకుండా దృఢంగా కూడా ఉంటాయి.