శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (15:42 IST)

భోజనాంతరం లవంగాన్ని నమిలితే..?

మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. కడుపులో లేదా ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. వంటిట్లో లభించే లవంగంతో పరిష్కరించొచ్చు. స్పైసీ‌ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, ఒత్తిడి వలన ఎసిటిడీ సమస్య వస్తుంది. వీటన్నింటిని లవంగంతో పరిష్కరించుకోవచ్చు. 
 
తలనొప్పి, క్యాన్సర్లు, డయాబెటిస్, ఇన్ఫెక్షన్స్, సైనస్, ఫ్లూ, జలుబు వంటి వ్యాధులు రాకుండా చూడడంలో లవంగం తోడ్పడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి కాలేయాన్ని సంరక్షిస్తంది. ఎముకలను ధృడంగా ఉంచుతుంది. లవంగాలను నోటి సమస్యలకు, దుర్వాసనను అరికట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు. వీటిని జ్యూసె‌స్‌లో ఎక్కువగా వాడుతారు. దంతాల నొప్పిగా అనిపించినప్పుడు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
లవంగం తినడం వలన నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. కనుక భోజనం చేసిన తరువాత లవంగం నమిలితే ఫలితం ఉంటుంది. ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. నోట్లో లవంగం ఉంచుకుని మెల్లగా నమలడం వలన కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.