గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (15:26 IST)

రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ప్రయోజనం ఉంటుందా?

కొబ్బరి నీళ్లు సహజసిద్ధంగా లభించే ఓ పానీయం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు ఏ కాలంలోనైనా మనకు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని వేసవిలో తాగేందుకు ఇష్టపడుతుంటారు. నిజానికి వీటిని ఏకాలంలోనైనా తాగవచ్చు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. 
 
* మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. శరీరానికి నూతన శక్తి వస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
* చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
* కొబ్బరి నీళ్లను పరగడుపున తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
* శరీరంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు బయటకు వెళ్లిపోతాయి.
 
* కొబ్బరి నీళ్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటి సమస్యలను దూరం చేస్తాయి.
* జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే వారు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.