శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (14:36 IST)

అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే..?

అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి. చెట్ల నుంచి కల్లు తీశాక కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. 
 
దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. 
 
మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్‌ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు ఏనాడో చెప్పారు. ప్రస్తుతం ఇది నిజమని పరిశోధనల్లో కూడా తేలిపోయింది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.