గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (18:18 IST)

జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా వుంటే.. డబుల్ చిన్‌కు చెక్

ముఖ వర్చస్సు ఎంత ఉన్నా డబుల్‌ చిన్ ఉంటే ఆ వదనం అందాన్ని కోల్పోతుంది. ఈ సమస్య ఉన్నవారు చాలా మంది ఆందోళనకు గురౌతుంటారు. కొందరికి డబుల్‌ చిన్‌ వయసు వల్ల వస్తే, మరికొందరికి జన్యుపరంగా ఇది సంక్రమిస్తుంది. దీనికి శరీర బరువు కూడా ఒక కారణం. వ్యాయామాలు చేయకపోవడం, చర్మం వదులుకావడం, జన్యుపరమైన అంశాలు ముఖ్య కారణాలు. 
 
శరీర భాగాలకు లాగానే ఫేషియల్‌ కండరాలకు కూడా నిత్యం వ్యాయామం అవసరం. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారడమే కాకుండా టోనింగ్‌ కూడా బాగా అవుతుంది. ఇలాంటి వారు పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. తరచూ స్కిన్‌ కేర్‌ పద్ధతులను అనుసరించినట్లయితే చర్మం ఆరోగ్యకరంగా, మృదువుగా ఉండడంతో పాటు గడ్డం కింద కొవ్వు వల్ల ఏర్పడే ముడతలు కనపడకుండా ఉంటాయి. 
 
డబుల్‌ చిన్‌ని చాలామంది అందానికి సంబంధించిన అంశంగానే చూస్తారు కానీ వైద్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆలోచించరు. కానీ డబుల్‌ చిన్‌ సమస్యను అధిగమించడానికి సురక్షితమైన రకరకాల వైద్య పద్ధతులు ఉన్నాయి. గడ్డం కింద భాగంలో చేరిన కొవ్వును తొలగించేందుకు పలు నాన్‌ ఇన్వేసివ్‌ చికిత్సలను వైద్య నిపుణులు చేస్తున్నారు. 
 
వీటిల్లో డైట్‌, వ్యాయామాలు వంటి సింపుల్‌ టెక్నిక్స్‌ సైతం ఉన్నాయి. డబుల్‌ చిన్‌ పరిష్కారానికి క్రియోలిపోలసిస్‌ చేస్తారు. ఇది పాపులర్‌ ప్రొసీజర్‌. లేజర్‌ రిడక్షన్‌ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు.