సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 మే 2019 (22:14 IST)

మండే వేసవి... చల్లని కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది?

మండే వేసవిలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్ లాంటివి తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ.... మన ఆ రోగ్యాన్ని మనమే చేతులారా పాడుచేసుకున్న వారమవుతాము. మనం పీల్చుకునే ప్రాణ వాయువు ఊపిరితిత్తులలోనికి వెళ్లి శరీరానికి హాని కలిగించే కార్బన్ డైఆక్సైడ్‌ను బయటకు పంపించి వేస్తుంది. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ అనే విష వాయువును కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం నిలువ ఉంచడం కోసం అందులో కలుపుతారు.
 
అందువలనే కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే నోటిలో నుండి, ముక్కులో నుండి ఆ వాయువు బయటకు వస్తుంది. కూల్ డ్రింక్స్‌లో పాస్ఫరిక్ యాసిడ్, కార్పోలిక్ యాసిడ్ లాంటివి కలుపుతారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందువలనే కూల్ డ్రింక్స్‌ను తాగిన వెంటనే త్రేన్పులు రావడం, కడుపులో మంట, ఎసిడిటి కలుగుతాయి. మన పిల్లలకు కూల్ డ్రింక్స్ పేరుతో మనమే చల్లని విష పదార్థాన్ని అందిస్తున్నాం. 
 
చల్లని పదార్దాలే కాదు వేడి పదార్దాలు కూడా మన ఆరోగ్యానికి మంచివి కావు. కాఫీ, టీ లాంటివి అతి వేడిగా తాగడం వలన ఎక్కువగా పంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏదేమైనప్పటికి అతి చల్లని, వేడి పదార్దాలు మన ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయన్న విషయం మనం గుర్తించాలి.