సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (11:18 IST)

గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు తెలుసా?

గ్రీన్​ టీని పరగడుపున అసలు తాగకూడదు. దానికి బదులు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బెటర్​. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకి పోతాయి. కానీ ఖాళీ కడుపుతో గ్రీన్​ టీ తాగితే అసిడిటీ జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. లివర్​కి సంబంధించిన  సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. 
 
రాత్రి పూట నిద్రకు గంటన్నర ముందు గ్రీన్​ టీ తాగితే జీవక్రియలు బాగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల నిద్రపోతున్నా కూడా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. అలాగే జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. 
 
గ్రీన్​ టీ తాగడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి. గ్రీన్​ టీలో ఉండే యాంటీ మైక్రోబియల్​ దంతాలను సంరక్షిస్తాయి. గ్రీన్​ టీలో చక్కెర, పాలు కలపకుండా తాగడం వల్ల అందులో ఉండే  ఔషధ గుణాలు దంత సమస్యలను దూరం చేస్తాయి. గ్రీన్​ టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులు కూడా దరిచేరవు. శరీరంలోని చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.