గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 9 మే 2019 (19:08 IST)

నల్లద్రాక్ష గుజ్జుతో అలా మసాజ్ చేసుకుంటే? (video)

మన ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యంత ఫోషక విలువలు కలిగి ద్రాక్ష ఆరోగ్యాన్ని అంధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ద్రాక్ష రసం వల్ల ఆరోగ్యం ప్రయోజనం మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు దాక్ష రసం త్రాగడం వల్ల ఒక అందమైన, ప్రకాశవంతమై చర్మాన్ని సహజసిద్ధంగా అందిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
 
1. ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి.
 
2. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి.
 
3. నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు, క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.
 
4. చాలామంది అసిడిటితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇది అసిడిటిని తగ్గిస్తుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో బాధపడుతున్నవారికి ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.
 
5. ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది.
 
6. చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.