గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (13:33 IST)

సబ్జా సీడ్స్‌‌తో సంతోషం.. ఎలా? (Video)

వేసవికాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజలు పిత్తాశయ రోగాలను దూరం చేస్తాయి. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఉపయోగించాలి. సగ్గుబియ్యంలా నలుపుగా వుండే ఈ గింజల్లో పీచు అధికంగా వుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజు ఒక స్పూన్ సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఒక స్పూన్ సబ్జా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అజీర్తిని దూరం చేస్తాయి. 
 
ఛాతిలో మంటకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. వేడి పాలల్లో సబ్జా గింజల్ని కలిపి చిన్నారులకు ఇస్తే.. ఉదర రుగ్మతలు తొలగిపోతాయి. జలుబు, దగ్గు, జ్వరం మటాష్ అవుతుంది.
 
అలాగే సబ్జా గింజలతో చర్మ సమస్యలుండవు. మహిళల్లో కిడ్నీ సంబంధిత రుగ్మతలను వీటితో దూరం చేసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిమిని ఇవి తగ్గిస్తాయి. వేసవిలో ఫలూడా, ఐస్ క్రీమ్‌లు, ఫ్రూట్ సలాడ్స్‌, వెజ్ సలాడ్స్‌ల్లో సబ్జా సీడ్స్‌ను చేర్చుకోవడం మరిచిపోకూడదు. 
 
ఇంకా సబ్జా సీడ్స్‌ను తీసుకుంటే సంతోషంగా వుండవచ్చు. అదెలాగంటే.. సబ్జాసీడ్స్ మానసిక స్థితిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సబ్జా గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగ వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.