సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (19:05 IST)

రోజూ ఒక స్పూన్ తేనె చాలు.. ఎందుకో తెలుసా?

జంక్ ఫుడ్స్, బయట ఆహారాలు, నిల్వ ఉంచిన ఆహారాలు తినడం వలన చాలా మంది ఫుడ్ పాయింజనింగ్ బారిన పడుతున్నారు. ఇలా జరిగినప్పుడు వాంతులు విరేచనాలు అవుతాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.


కడుపులో వికారంగా ఉన్నప్పుడు జీలకర్రను నమిలి మింగితే ఫలితం కనిపిస్తుంది. లేదా జీలకర్రను నీటిలో మరిగించి కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిని తాగితే కడుపులో మంట వికారం తగ్గుతుంది. రోజూ ఒక స్పూన్ తేనెను తీసుకున్నా ఫుడ్ పాయిజనింగ్ నుండి తప్పించుకోవచ్చు. 
 
ఫుడ్ పాయిజనింగ్ వలన శరీరంలో పొటాషియం పరిమాణాలు తగ్గిపోతాయి. అప్పుడు చాలా నీరసం వస్తుంది. ఆ సమయంలో అరటిపండు తినాలి. లేదా రెండు అరటిపండ్లను గుజ్జుగా చేసి పాలలో కలిపి తాగితే ప్రయోజనం కనిపిస్తుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఒక కప్పు పెరుగు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.